Ticker

10/recent/ticker-posts

మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ Kadgam Lyrics - Honey, Shakti, Devi Sri Prasad


మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ Kadgam
Singer Honey, Shakti, Devi Sri Prasad
Composer Devi sri Prasad
Music Devi Sri Prasad
Song WriterShakthi

Lyrics

 



తికమక పెట్టే అమాయకత్వం… చకచకలాడే వేగం

అలాగ ఉంటాం… ఇలాగ ఉంటాం…

ఆకతాయిలం మేము…



ఏయ్ చెప్పేదేదో అర్ధమయ్యేట్టు చెప్పరా..!

అరె భాయ్..! ఇస్ర్టెటుగానే చేప్తా… ఇనుకో…!!



హే… సత్యం పలికే హరిశ్చంద్రులం… సత్యం పలికే హరిశ్చంద్రులం

అవసరానికో అబద్ధం…

నిత్యం నమాజు పూజలు చేస్తాం… రోజు తన్నుకు చస్తాం

సత్యం పలికే హరిశ్చంద్రులం… అవసరానికో అబద్ధం

నిత్యం నమాజు పూజలు చేస్తాం… రోజు తన్నుకు చస్తాం



నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం… నమ్మడమేరా కష్టం

అరె..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం… నచ్చకుంటే మీ కర్మం

అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా… చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్

అరె..! మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్ ||4||



వందనోటు జేబులో ఉంటే… నవాబు నైజం

పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం…

కళ్ళులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం…

పడుచుపోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం…



ప్రేమ కావాలంటాం… పైసా కావాలంటాం

ఏవో కలలే కంటాం… తిక్క తిక్కగా ఉంటాం



ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం…

తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం…

కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికోటేస్తాం…

అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం…



రూలూ ఉంది… హ హ

రాంగూ ఉంది… హె హె

రూలూ ఉంది… రాంగూ ఉంది

తప్పుకు తిరిగే లౌక్యం ఉంది…

మేమే… ఇండియన్స్… || 3 ||

అరె..! మేమే… ఇండియన్స్

సత్యం పలికే హరిశ్చంద్రులం… అవసరానికో అబద్ధం



వందేమాతరం… వందేమాతరం

వందేమాతరం… వందేమాతరం ||4||



కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో… ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో

శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది… ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది

ఈశ్వర్ అల్లా ఏసు… ఒకడే కదరా బాసు

దేవునికెందుకు జెండా… కావాలా పార్టీ అండా



మాతృభూమిలో మంటలు పెట్టే మాయగాడి కనికట్టు…

అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు…

భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్ ఒట్టు…

కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు…



దమ్మే ఉంది… హ హ

ధైర్యం ఉంది… ఆ ఆ

దమ్మే ఉంది… ధైర్యం ఉంది…

తలవంచని తెగ పొగరే ఉంది…



మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్

అరె..! మేమే… ఇండియన్స్



సత్యం పలికే హరిశ్చంద్రులం… అవసరానికో అబద్ధం…

ఓ..! సత్యం పలికే హరిశ్చంద్రులం… అవసరానికో అబద్ధం…

నిత్యం నమాజు పూజలు చేస్తాం… రోజు తన్నుకు చస్తాం



నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం… నమ్మడమేరా కష్టం

ఓ..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం… నచ్చకుంటే మీ కర్మం

అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా… చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్

అరె..! మేమే… ఇండియన్స్

మేమే… ఇండియన్స్ ||4||




మేమే… ఇండియన్స్ మేమే… ఇండియన్స్ Kadgam Watch Video

Post a Comment

0 Comments