The Soul Of Satya , Satya Lyrics - Sruthi Ranjani

Singer | Sruthi Ranjani |
Composer | Sruthi Ranjani |
Music | Sruthi Ranjani |
Song Writer | Sruthi Ranjani |
Lyrics
నాలో హ, ఒక చిన్న బిడియమే
మొదలైందే ఇపుడిలా
ఏంటో ఎపుడు లేని అలజడే
నీవల్లే నాకిలా
పొద్దునవగానే తలచే పేరు నువ్వు
నిద్దరోదామంటే ధ్యాస సలపనీవు
ఇన్నినాళ్ళు నువ్వు నాలో సగముగా
ఉన్నట్టుండి నేను ఉండీ లేనట్టున్న
గుర్తుపట్టనంత మారిపోతూ ఉన్న
గుండె ఆగే దాకా నీతో బతకనా
ఎంత దూరమెళ్ళినా
నా గమ్యమే నీవుగా
అంతులేని పయనమే ఇదా
ఇక ప్రాణమే వదిలినా
నీ నీడ నన్ను వదులునా
తప్పదంటు తప్పుకోమనా
నాలో ఒక చిన్న బిడియమే
మొదలైందే ఇపుడిలా
హా ఆ ఆ ఆ హ హ
హ హ హహ హ ఆ ఆ
నువ్వు నవ్వుతుంటే
మనసు మురిసిపోదా
నవ్వు వెనుక నువ్వే ఉన్నావుగా
కళలు కన్న కనులే
అలసి వాలిపోగా
కలలు వీడి నిజమే నమ్మాలిగా
మనమని ధ్యాసలో
కలిసినమనమనుకున్న
మనమనే మాటలో నువ్వు లేవుగా
రావని తెలిసినా ఆశ నీడ లేకున్నా
నేను నీ సగమని గురుతు చేయనా
0 Comments