నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన Lyrics - K.S. Chitra,S.P.Balasubramanyam

Singer | K.S. Chitra,S.P.Balasubramanyam |
Composer | Mani Sharma |
Music | Mani Sharma |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Lyrics
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ
నా కన్నుల నిధే వెన్నెల ఓ ఓ ఓ
నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా
ఇంకొంచం అనుకున్న ఇకచాల్లే అన్నానా
వదలమంటే ఏమిటర్ధం
వదిలి పొమ్మన
పనిమాల పైపైన పడతావేం పసికూన
ముద్దు మీరుతున్న పంతం
హద్దులోనే ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికి
మొగలి మొనలు తగిలేనా
లేత సోయగానికి కూత దేనికి
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన
ఒదిగున్న ఒరలోన
కదిలించకె కుర్రదానా
కత్తి సాముతో ప్రమాదం పట్టు జారేనా
పెదవోపని పదునైన పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం
నీకు నేను నేర్పన
సొంత సొగసు బరువేన సుకుమారికి
అంత బిరుసు పరువేన
రాకుమారుడాన్టి నీ రాజసానికి
గారం చేసిన నయగారం చూపిన
కనికారమే కలుగుతోందే
కష్టపడకే కాంచన
నేనే నేనుగా లేనే లేనుగా ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ
0 Comments