Chustu Chustune Rojulu Gadiche Lyrics - VIJAY BULGANIN, MEGHANA

Singer | VIJAY BULGANIN, MEGHANA |
Composer | VIJAI BULGANIN |
Music | VIJAI BULGANIN |
Song Writer | SURESH BANISETTI |
Lyrics
అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో, నాకు తెలీదే
అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో, నాకు తెలీదే
నా మనసే మాటే వినదే నీ వెనుకే ఉరికే ఉరికే
నీ మదినే జతగా అడిగే కాదనకే కునుకే పడదే పడదే, పడదే
ఓ క్షణం నవ్వునే విసురు ఓ క్షణం చూపుతో కసురు
ఓ క్షణం మైకమై ముసురు ఓ క్షణం తీయవే ఉసురు
చూస్తు చూస్తూనే రోజులు గడిచాయే
నిన్నెలా చేరడం చెప్పవా ఆ…..
నాలో ప్రేమంతా నేనే మొయ్యాలా
కొద్దిగా సాయమే చెయ్యవా
ఇంకెంత సేపంట నీ మౌన బాష
కరుణించవే కాస్త త్వరగా
నువ్వు లేని నను నేను ఏం చేసుకుంటా
వదిలెయ్యకే నను విడిగా, ఊ…..ఊ….
ఓ క్షణం ప్రేమగా పిలువు ఓ క్షణం గుండెనే తెరువు
ఓ క్షణం ఇవ్వవా చనువు ఓ క్షణం తోడుగా నడువు
అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
ఎలా పడ్డానో ఏమో, నాకు తెలీదే
అలా చూశానో లేదో, ఇలా పడ్డానే
నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలే
నాలోకం నాదే ఎపుడు నీ మైకం కమ్మే వరకు
నీ కలనీ కనేదెపుడు ఈ కలలే పొంగేవరకు.. కలలే అరెరే
మనస్సుకే మనస్సుకే ముందే రాసి పెట్టేసినట్టుందే
అందుకే కాలమే నిన్నే జంటగా పంపినట్టుందే
0 Comments